అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డొమోక్రటిక్ అభ్యర్థిని కమలా హారిస్ విజయం సాధించలేకపోయింది. తొలి నుంచి కమలా విజయం సాధిస్తుందని అందరూ ఊహించినప్పటికీ అనూహ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ట్రంప్ తో పాటు తెలుగు రాష్ట్రంలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కి చెందిన అల్లుడు అమెరికాకు ఉపాధ్యక్షుడు కావడం విశేషం.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించడంతో బిట్ కాయిన్ మాత్రం రయ్ రయ్ మంటూ దూసుకెళ్తోంది. తాజాగా ఒక బిట్‌కాయిన్ విలువ రూ.64 లక్షలు దాటింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో 10% విలువ పెరిగి 76 వేల డాలర్లకు (రూ.64 లక్షలు) చేరింది బిట్‌కాయిన్. ఈ ఏడాది ఆరంభంలో రూ.30 లక్షల వద్ద ఉన్నది బిట్‌కాయిన్ విలువ. కానీ బిట్ కాయిన్‌కు మద్దతు పలుకుతున్న డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, రాబర్ట్ కియోసా తదితరులు. మరోవైపు ట్రంప్ విజయంతో ఒక్కరోజులోనే రూ.₹2.2 లక్షల కోట్ల లాభాలు పొందింది ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ.