బిత్తిరి సత్తి జంప్.. V6లో మునిగి టీవీ9 లో తేలిన ‘బిత్తిరి సత్తి’ రవి..!

-

వీ6 తీన్మార్ వార్త‌ల బిత్తిరి స‌త్తి ఇకపై ఆ చాన‌ల్‌లో క‌నిపించ‌డు. ఎందుకంటే ఆయ‌న ఆ చాన‌ల్‌కు గుడ్‌బై చెప్పాడు.

తీన్మార్ వార్త‌లు అంటే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది బిత్తిరి స‌త్తి.. అలియాస్ చేవెళ్ల ర‌వి.. గ‌తంలో శివ‌జ్యోతి (సావిత్రి) ఉన్న‌ప్పుడు స‌త్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిత్యం రాత్రి 9.30 గంట‌లు అయిందంటే చాలు.. వీ6 చాన‌ల్ ను మ‌న చేతి వేళ్లు రిమోట్‌పై వెతుకుతాయి. త‌న‌దైన శైలిలో యాస‌లో మాట్లాడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకున్న బిత్తిరి స‌త్తి వ‌ల్ల వీ6కు టీఆర్పీ రేటింగ్‌లు కూడా పెరిగాయి. అయితే ఇక‌పై అదంతా గ‌తం కానుంది. ఎందుకంటే.. వీ6 చాన‌ల్‌కు స‌త్తి గుడ్‌బై చెప్పాడు.

bithiri sathi joined in tv9 left v6

వీ6 తీన్మార్ వార్త‌ల బిత్తిరి స‌త్తి ఇకపై ఆ చాన‌ల్‌లో క‌నిపించ‌డు. ఎందుకంటే ఆయ‌న ఆ చాన‌ల్‌కు గుడ్‌బై చెప్పాడు. బిత్తిరిస‌త్తి వీ6ను వీడి టీన్యూస్‌లో చేరుతాడ‌ని గ‌త కొంత కాలంగా జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా.. అంద‌రికీ షాక్ ఇస్తూ స‌త్తి టీవీ9 ఆఫీసులో స‌డెన్‌గా క‌నిపించాడు. దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీవీ9లో చేరిన‌ట్లు అధికారికంగా తెలిసింది. కాగా టీవీ9 న్యూస్ ప్రెజెంట‌ర్ ర‌జ‌నీకాంత్ ను బిత్తిరి స‌త్తి క‌లిసిన ఫొటో ఒకటి ప్ర‌స్తుతం నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే స‌త్తి టీవీ9లో చేరిక క‌న్‌ఫాం అయిన‌ వార్త‌ ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

అయితే గ‌తంలో శివ‌జ్యోతి వీ6ను వ‌దిలిపెట్టాక ఆమె సావిత్రి అన్న పేరును ఎక్క‌డా వాడుకోవ‌డానికి వీలు లేకుండా వీ6 క‌ట్ట‌డి చేసింది. ఈ క్ర‌మంలోనే స‌త్తి కూడా ఆ పేరును వ‌దిలి మ‌రొక పేరుతో క‌నిపిస్తాడా..? అని ప్రేక్ష‌కులకు అనుమానం వ‌స్తోంది. అలాగే స‌త్తి ఆ గెట‌ప్ లో కాకుండా కొత్త పేరుతో మ‌రొక కొత్త గెటప్ లో క‌నిపిస్తారా అని కూడా అభిమానుల్లో ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అయితే ఈ విష‌యంపై అతి త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది. ఇక స‌త్తిని టీవీ9లోకి ర‌ప్పించేందుకు ఆయ‌న‌కు భారీగానే రెమ్యున‌రేష‌న్ ఇచ్చి ఉంటార‌ని కూడా తెలుస్తోంది.

కాగా మొన్న సావిత్రి… ఇప్పుడు స‌త్తి.. ఇద్ద‌రూ వీ6 నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఇక‌పై తీన్మార్ వార్త‌ల‌కు పూర్తిగా క‌ళ త‌ప్ప‌నుంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే వారిద్ద‌రితోనే ఆ షో ఎంతోకాలంగా విజ‌య‌వంతంగా సాగింది. కానీ ఆ ఇద్ద‌రూ ఇప్పుడు లేరు క‌నుక‌.. వీ6 టీఆర్‌పీలు కూడా ప‌డిపోతాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో వీ6 ఏం చేస్తుందో చూడాలి..! ఏది ఏమైనా.. స‌త్తి చేరిక‌తో ఇప్ప‌టికే రేటింగ్స్‌లో ముందున్న టీవీ9 మ‌రింత ముందుకు దూసుకుపోతుంద‌న‌డంలో సందేహం లేదు..!

Read more RELATED
Recommended to you

Latest news