వీ6కు బిత్తిరి సత్తి గుడ్ బై… త్వ‌ర‌లో టీన్యూస్ కు?

3106

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం రావడంతో సావిత్రక్క చానెల్ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత సావిత్రక్క ప్లేస్ లో వేరే వాళ్లను పెట్టినప్పటికీ… తీన్మార్ వార్తల్లో ముందున్న జోష్ లేదు.

బిత్తిరి సత్తి.. ఈయన గొంతు వింటే చాలు… తెలంగాణ ప్రజల గొంతుకలా అనిపిస్తుంది. తెలంగాణ మాండలికానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాడు బిత్తిరి సత్తి. నిజానికి ఆయన అసలు పేరు బిత్తిరి సత్తి కాకున్నప్పటికీ… బిత్తిరి సత్తిగానే ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాడు. వీ6 న్యూస్ చానెల్ కు ప్రస్తుతం ఓ గుర్తింపు ఉంది అంటే దానికి కారణమైన అతి ముఖ్యమైన వాళ్లలో బిత్తిరి సత్తి ఒకరు. తీన్మార్ వార్తలకు తెలంగాణలో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. ఆ వార్తలకు అంత క్రేజ్ వచ్చింది బిత్తిరి సత్తి, సావిత్రక్క వల్లనే.

bithiri sathi to join in tnews

అయితే.. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం రావడంతో సావిత్రక్క చానెల్ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత సావిత్రక్క ప్లేస్ లో వేరే వాళ్లను పెట్టినప్పటికీ… తీన్మార్ వార్తల్లో ముందున్న జోష్ లేదు. అంత క్రేజ్ లేదు. సప్పసప్పగా మారాయి వార్తలు. బొప్పికొడుతున్నాయి.

గత రెండు మూడు రోజుల నుంచి అయితే తీన్మార్ వార్తలను చూడాలంటేనే ప్రేక్షకులకు వాంతులు వస్తున్నాయి. ఎందుకంటే.. తీన్మార్ వార్తల్లో కనిపించే బిత్తిరి సత్తి.. గత రెండు మూడు రోజుల నుంచి కనిపించకపోవడమే.

ఎందుకు సత్తి తీన్మార్ వార్తల్లో కనిపించడం లేదు అంటే… సత్తి కూడా వీ6 చానెల్ కు గుడ్ బై చెప్పాడట. అందుకే సత్తి.. తీన్మార్ వార్తల్లో కనిపించడం లేదు. టీన్యూస్ చానెల్ లో భారీ ఆపర్ తో త్వరలో చేరబోతున్నాడట.

టీఆర్ఎస్ కు వ్యతిరేకమే కారణమా?

గత కొన్ని రోజులుగా వీ6 వెలుగు, వీ6 న్యూస్ చానెల్ రెండూ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎన్నో కథనాలను ప్రచురిస్తున్నాయి… చూపిస్తున్నాయి. ఎప్పుడైతే వీ6 అధిపతి, మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరారో…. అప్పటి నుంచి వీ6 టీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ ప్రభుత్వంపై పుంఖానుపుంఖలుగా కథనాలను వండి వార్చుతోంది. అయితే.. టీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తూ ప్రచురిస్తున్న కథనాలకు బిత్తిరి సత్తి కలత చెందాడట.

తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి… తెలంగాణ రావడానికి కారణమైన టీఆర్ఎస్ పార్టీపై వీ6 దుమ్మెత్తిపోయడానికి బిత్తిరి సత్తి తట్టుకోలేకపోయాడట. అందుకే… వీ6 చానెల్ కు గుడ్ బై చెప్పి టీన్యూస్ లో చేరుతున్నాడని తెలుస్తోంది.