జనగామ జిల్లా : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని జనగామ జిల్లాలోని రత్నతండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఘటన స్థలంలో పరిస్థితి ఉద్రిక్తత మారింది. నర్మెట్ట మండలం మచ్చుపహడ్ రిజర్వు ఫారెస్ట్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వెళ్లారు.
అయితే ఈ నేపథ్యంలోనే.. ఆ దారి మధ్యలో ఉన్న ఆగపేట గ్రామంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని రత్నతండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన తో అలర్ట్ పోలీసులు.. గ్రామస్తులను అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, రత్నతండా గ్రామస్తుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. రత్నతండా గ్రామస్తులతో వాగ్వాదానికి దిగిన పోలీసులు.. ఎట్టకేలకు ఆ గ్రామస్థులను చెదరగొట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం రత్నతండా గ్రామస్తులు నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.