తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలని బీజేపీ అమలు చేస్తూనే ఉంది. వాస్తవానికి ఇప్పుడు అందరి దృష్టి మునుగోడు ఉపఎన్నికపైనే ఉంది. అన్నీ పార్టీలు అక్కడే ఫోకస్ పెట్టాయి. మునుగోడుని గెలవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం పెద్ద మైండ్‌గేమ్‌తో ముందుకెళుతుంది. మునుగోడుపై ఫోకస్ పెడుతూనే..రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టే వ్యూహాలు వేస్తుంది. టీఆర్ఎస్ పార్టీని మునుగోడుపైనే పూర్తిగా ఫోకస్ చేయనివ్వకుండా ఓ మైండ్ గేమ్ ఆడుతుంది.
బీజేపీ అదే మైండ్ గేమ్‌లో టీఆర్ఎస్ పడుతుంది..దీంతో ఆ పార్టీలో కంగారు మొదలవుతుంది. అసలు బీజేపీ అదే గేమ్ ఏంటంటే..మునుగోడుపైనే ఓ వైపు ఫోకస్ చేస్తూ..మరోవైపు ఇంకా కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రాబోతున్నారని, మునుగోడు మాత్రమే సెమీఫైనల్ కాదని, ఇంకా ఉపఎన్నికలు రావొచ్చని బీజేపీ నేతలు స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. అయితే బీజేపీ నేతల మాటలని లైట్ తీసుకోవడానికి లేదు. ఆ మాటలని పట్టించుకోకపోతే టీఆర్ఎస్ పార్టీని మునుగుతుంది.
తాజాగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ని బీజేపీలోకి లాగి టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. ఇదే క్రమంలో నల్గొండలో ఇంకా కొంతమంది నేతలు బీజేపీలోకి వస్తారని ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పార్టీ మారబోతున్నారని ప్రచారం వచ్చింది. చివరికి టీఆర్ఎస్ అధిష్టానం..ఆయనతో మాట్లాడి..పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చే పరిస్తితికి బీజేపీ తీసుకొచ్చింది.
అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ ఉపఎన్నిక రాబోతుందని ప్రచారం మొదలైంది. గ్రేటర్ పరిధిలో ఏ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్ అవుతారనే టెన్షన్ టీఆర్ఎస్ అధిష్టానంలో కనిపించింది. ఇదే క్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. దీంతో కేటీఆర్ ఏకంగా ఆయనతో వెంటనే భేటీ అవ్వాల్సి వచ్చింది. అలాగే పద్మారావు..టీఆర్ఎస్‌లోనే ఉంటానని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాననే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి మైండ్ గేమ్‌తో కమలం..కారుని ఆడేసుకుంటుంది.