ఇటీవల హర్యానా, కర్ణాటక,బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్,ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తమకున్న బలం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో.. హర్యానా నుంచి అభ్యర్థిగా హర్యానా బీజేపీ మాజీ చీఫ్ సుభాష్ బరాలా ను ప్రకటించారు. ఇందులో బీహార్ నుంచి ఇద్దరు.. డా. భీమ్ సింగ్డా,ధర్మ శీల గుప్తా కు స్థానం దక్కింది. అలాగే కర్ణాటక నుంచి నారాయణ క్రిష్‌నాసా,ఛత్తీష్‌గడ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్ బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.
ఈ రోజు బీజేపీ రిలీజ్ చేసిన లిస్టులో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ నుంచి ఏడుగురిని ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న రిలీజ్ కాగా.. 15 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. అలాగే 16న నామినేషన్ల పరిశీలన, 20న విత్ డ్రాకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. కాగా ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి.