రాజ్య సభలో బీజేపీ కొత్త రికార్డును సృష్టించింది. 1988 నుంచి రాజ్య సభలో ఏ పార్టీ కూడా 100 సీట్లను తెచ్చుకోలేదు. కాంగ్రెస్ తో కూడా వంద సీట్లు గెలవడం.. 1988 తర్వాత సాధ్యం కాలేదు. తాజా గా బీజేపీ కాగ తాజా గా బీజేపీ ఆ రికార్డును చేరిపేసి.. కొత్త రికార్డును సృష్టించింది. 1988 తర్వాత ఒక రాజకీయ పార్టీ ఒంటరీగా రాజ్య సభలో 100 సీట్లు సాధించడం ఇదే తొలిసారి. కాగ గురు వారం 13 రాజ్య సభ స్థానాలకు ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. దీనిలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది.
దీంతో పెద్దల సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 101 కు చేరింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో రాజ్య సభలో మద్దతు లేక పోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. లోక్ సభలో భారీ మద్దతు ఉన్నా.. రాజ్య సభకు వచ్చే సరికి బిల్లులు వీగిపోవడం జరిగేవి. అయితే ప్రస్తుతం సీన్ మార్చేసింది. 100 మార్క్ ను దాటేయడంతో రాజ్య సభలో బలమైన పార్టీగా ఎదిగింది. ఉపాధ్యక్ష ఎన్నికల రేసులో కూడా బీజేపీ హావానే ఉండే అవకాశాలు ఉన్నాయి.