తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 25 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు ప‌డిపోతుంది. ప్ర‌తి రోజు కూడా కింద‌టి రోజు కంటే.. త‌క్కువ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ రోజు కూడా నిన్న‌టితో పోలిస్తే.. కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఈ రోజు క‌రోనా బులిటెన్ ను కాసేప‌టి క్రితం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ గురు వారం తెలంగాణ రాష్ట్రంలో 31 కేసులు న‌మోదు అయ్యాయి.

అంటే.. నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో 6 క‌రోనా కేసులు త‌గ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 53 మంది క‌రోనా వైర‌స్ బాధితులు వైర‌స్ నుంచి పూర్తి కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 400 కంటే త‌క్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 392 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 16,839 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. అయితే దీనిలో మ‌రో 611 ప‌రీక్షల ఫ‌లితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news