పెళ్లైన మహిళలు ఆ దిక్కున అస్సలు పడుకోకూడదట..!

-

ఇంటికి వాస్తు చాలా ముఖ్యం.. ఏ దిక్కుల్లో ఉండాల్సినవి ఆ దిక్కులో లేదంటే.. వాస్తుకు తిక్కలేస్తుంది. ఇంకా ఆగం ఆగం. వాస్తు ప్రకారం వస్తువులే కాదు.. మనుషులు కూడా ఉండాలి.. అర్థంకాలేదా.. వాస్తు ప్రకారం ఆ దిక్కునే పెళ్లైన స్త్రీలు నిద్రపోవాలి. వేరే దిక్కులో పడుకుంటే ఏమైతది అనుకుంటున్నారా..? ఏమైనా కావొచ్చు. నిద్రపట్టకపోవచ్చు, భార్యభర్తల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు.. ఇవన్నీ మేం చెప్పడంలేదండీ.. వాస్తుశాస్త్రం చెప్తోంది.
వాస్తు ప్రకారం వాయువ్య దిశ దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, బలాన్ని ఇస్తుంది. ఇంటికి వాయువ్య దిశలో దోషం ఉంటే స్నేహితులు కూడా శత్రువులుగా మారతారు. దీంతో పాటు శక్తి, వయస్సు తగ్గుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లయిన మహిళలు వాయువ్య దిశలో అంటే పడమర కోణంలో పడుకోకూడదు. ఈ దిశలో పడుకోవడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. మరోవైపు, పెళ్లికాని అమ్మాయిలు వాయువ్య దిశలో నిద్రించాలి. ఎందుకంటే ఈ దిశలో పడుకోవడం వారికి వివాహ అవకాశాలను బలపరుస్తుందట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమట.
వాస్తు ప్రకారం పిల్లల చదువు కోసం స్టడీ టేబుల్, కుర్చీని ఉత్తరం (తూర్పు-ఉత్తరం), లేదా పడమర కోణంలో ఉంచడం శ్రేయస్కరం. అదే సమయంలో బుక్ షెల్ఫ్‌ను పశ్చిమ లేదా దక్షిణ దిశలో ఉంచడం శ్రేయస్కరం. అయితే టేబుల్ ల్యాంప్ ఎల్లప్పుడూ టేబుల్ కి ఆగ్నేయ దిశలో ఉండాలి.
వాయువ్య దిశలో దోషాన్ని తొలగించడానికి అక్వేరియం లేదా చిన్న ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచిది.. ఇందులో 8 బంగారు చేపలు, ఒక నల్ల చేపను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు.
మరుగుదొడ్డి దక్షిణ దిశ లేదా పశ్చిమ కోణం మధ్యభాగం అనుకూలంగా ఉంటుంది. అలాగే టాయిలెట్‌లో సీటును కూర్చోవాలంటే ముఖం ఉత్తరం లేదా దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి.
ఇంట్లో మనకు ఇష్టం వచ్చినట్లు కాకుండా.. వాస్తును శాటిస్ఫై చేస్తే.. మనం సంతృపత్తిగా ఉండొచ్చు అంటున్నారు పండితులు.. ఇక ఫైనల్ గా.. ఇక్కడ ఇచ్చిన సమాచారం అంతా వాస్తుశాస్త్ర నిపుణులు అందించిందే తప్ప.. మనలోకం సొంతంగా ఊహించుకుని రాసింది కాదని గమనించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news