పార్క్ హయత్ హోటల్ లో మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ కావడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతుందట. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఏమిటి జరగకపోయే ఏమిటి.. ఆ రెండింటిలో ఏది జరిగినా బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటి.. నష్టం ఏమిటి? అసలు ఈ తలపోటు వ్యవహారంలో ఏ ఫలితం ఆశించి వీరిద్దరూ వెళ్లారు.. విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్న ఆ ఆన్ లైన్ నాలుగో నేత ఎవరు? చంద్రబాబుకోసం, ఏపీ టీడీపీ కోసం అయితే.. అందుకు బీజేపీ పరువును బజారున పాడేసే సాహసం చేయడమేమిటి? అని ఢిల్లీ పెద్దలు ఫైరవుతున్నారంట.
నేతల సంగతి అలా ఉంటే… నిమ్మగడ్డ వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. హోటళ్లలో రాజకీయ నేతలలతో చర్చించాల్సిన అవసరం ఎన్నికల అధికారికి ఏంటని.. దీనిపై విచారణ జరిపించేదిశగా ఆలోచనలు చేస్తున్నారంట. ఇంతకాలం వైకాపా నుంచి నిమ్మగడ్డ విశ్వసనీయతపై వచ్చిన ఆరోపణలన్నింటికీ ఈ ఒక్క భేటీలు నిదర్శనమని అంటున్నారట. ఏది ఏమైనా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే… టీడీపీ – బీజేపీ కలిసే డ్రామాలు ఆడుతున్నాయన్న విషయం ప్రజల్లో బలపడిపోతుందని.. ఇప్పుడిప్పుడే బలపడుతున్న ఏపీలో ఇంతకు మించి చావుదెబ్బ మరొకటి ఉండదని అధిష్టానం పెద్దలు అంటున్నారట.
ఈ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం, కేంద్రప్రభుత్వం యొక్క స్పందన అలా ఉందని వార్తలొస్తుంటే… అసలు ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందనేదానిపై ఆసక్తి నెలకొంది!!