బిజెపికి మాపై ఆరోపణలు చేసే అర్హత లేదు – జగ్గారెడ్డి

-

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బిఆర్ఎస్ తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో పొత్తుకు బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయదన్నారు జగ్గారెడ్డి. బిజెపికి మాపై ఆరోపనలు చేసే అర్హత లేదన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ఫైనల్ అని అభిప్రాయపడ్డారు.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురికావలసిన అవసరం లేదని అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ కలిసి పని చేశారని, కేంద్రంలో బిజెపి తెచ్చిన అన్ని బిల్లులకు బిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అన్నారు. కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్టులు ఉన్నారు అని అంటున్నారని, పార్టీలో స్టార్ లు, సూపర్ స్టార్లే మాట్లాడుతుంటే ఎవరికి ఏం చెప్పే పరిస్థితి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news