వాపు-బలుపుల మధ్య తేడా చాలా ఉంటుంది. అయితే, ఈ విషయం తెలంగాణ బీజేపీ నేతలకు ఇంకా అర్ధం కావడం లేదు. వాపునే వారు బలుపుగా బ్రమపడుతున్నారని అంటున్నారు సామాన్యులు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వివిధ కారణాలతో నాలుగు స్తానాల్లో విజయం దక్కించుకున్న బీజేపీ నాయకులు వీ టి వెనకాల ఉన్న కారణాలను గుర్తించకుండా.. తమది గొప్ప విజయమని భ్రమపడుతున్నారు. ఈ క్రమంలో నే త్వరలోనే జరగనున్న హుజూర్ నగర్లపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ వ్యతిరే కత తమను గెలిపిస్తుందని అంటున్నారు.
అయితే, ఒక్కసారివాస్తవంలోకి వెళ్తే.. నిజమాబాద్‌లో బీజేపీ విజయం సాధించడానికి అనేక కారణాలు కనిస్తు న్నాయి. పసుపు రైతుల ఆవేదన ఇక్కడ బీజేపీకి కలిసివచ్చింది. అదేసమయంలో లోపాయికారీగా కాంగ్రెస్ కూడా ఇక్కడ బీజేపీకి సపోర్టు చేసింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత మధుయాష్కీ కనీస మాత్రంగా కూడా ప్రచారం చేయలేదు. ఇక, కవితపై ఇక్కడ ఉన్న వ్యతిరేకత భారీగా పెరిగిపోవడంతో ఇది బీజేపీకి లాభించింది.
అయితే, ఈ గెలుపు వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయన్న విషయాన్నిమరిచిపోతున్న బీజేపీ పెద్దలు తమ ఘనకార్యంగానే దీనిని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంకేముంది హుజూర్‌నగర్‌లోనూ తమదే గెలుపు గుర్రం అనుకుంటున్నారు. కానీ, వాస్త వానికి ఇక్కడ కాంగ్రెస్ కేడర్ బలంగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఆయన సతీమణి పద్మావతిపోటీ చేస్తున్నారు. పైగా నిజామాబాద్‌లో అప్ప టి బీజేపీ అభ్యర్థి ఇచ్చి వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు.
ఈ పరిణామం ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పరి ణమించే ఛాన్స్ ఉంది. పైగా కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు, మద్దతు దారులు కూడా ఉండడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే పరిణామంగా చెబుతున్నారు. ఇన్ని సానుకూలతలున్న కాంగ్రెస్ కూడా బలంగానే ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం మానేసి.. ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ.. కూర్చోవడం వల్ల ప్రయోజనం ఏంటో వారికే తెలియాలి.