తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు నేడు దీక్షలు చేయబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేడు ఢిల్లీలో దీక్ష చేస్తుంది. కాగ తెలంగాణ రాష్ట్ర బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. దీక్ష చేయనుంది. ఇందిరా పార్క్ వద్ద జరిగే ఈ దీక్ష.. వడ్లు కొను – లేదా గద్దె దిగు అనే నినాదంతో బీజేపీ నాయకులు దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్ష ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ దీక్షకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో పాటు రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొననున్నారు. కాగ వరి ధాన్యం విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీ గా దీక్షచేస్తున్నారు. దీంతో రైతులు ఎవరిని నమ్మాలో.. తెలియక అయోమయంలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ సర్కారే.. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుంది.