తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి టీఆర్ఎస్ vs బీజేపీ అన్నట్టు మారింది. ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ టీఆర్ఎస్ మాత్రం తాన పట్టు నిలుపుకోడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో BJP రాష్ట్ర నాయకుడు నాయకుడు నేలవెళ్లి రామారావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు.
ఈ దాడి జరిగిన వెంటనే ఆయనను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం ఆయన మృతి చెందాడు. ఆర్ధిక లావాదేవీల వల్ల ఘర్షణ జరగగా ప్రత్యర్థి కత్తితో గాయపరిచినట్టు చెబుతున్నారు. దీనికి సంబందించి పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది. ఆర్ధిక లావాదేవీలే కారణం అని చెబుతున్నా దీని వెనుక మరింకా ఏదయినా కారణం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హత్య చేసిన వ్యక్తీ రాజేష్ అని గుర్తించారు పోలీసులు.