వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్ కు నరకం

-

మోడరనా తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ను గురువారం స్వీకరించిన ఒక డాక్టర్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. బోస్టన్‌ లో ఒక వైద్యుడు తీవ్రమైన అలెర్జీతో బాధ పడుతున్నాడు అని అమెరికా మీడియా పేర్కొంది. బోస్టన్ మెడికల్ సెంటర్‌లోని జెరియాట్రిక్ ఆంకాలజీ ఫెలో డాక్టర్ హోస్సేన్ సదర్జాదేహ్కు టీకాలు వేసిన వెంటనే తనకు తీవ్రమైన ప్రతికూలతలు కనిపించాయని చెప్పింది.

అతను మత్తులోకి వెళ్లిపోయాడని, హృదయ స్పందనల వేగం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. మోడరనా తయారు చేసిన ఈ టీకాతో వచ్చిన మొదటి సమస్య ఇది. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయడం ప్రారంభించిన మొదటి వారంలోనే ఎ సమస్యలు వచ్చాయి. బోస్టన్ మెడికల్ సెంటర్ ప్రతినిధి డేవిడ్ కిబ్బే శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించారు. అతన్ని అత్యవసర విభాగానికి తీసుకువెళ్లారని చెప్పారు.

అలర్జీ వచ్చిన సమయంలో ఆయన హాలా ఇబ్బంది పడ్డారు అని అధికారులు వెల్లడించారు. చికిత్స తర్వాత ఆయన చాలా బాగున్నారని పేర్కొన్నారు. అమెరికాలో ప్రజలు ఫైజర్ ఇంక్ మరియు బయోఎంటెక్ వ్యాక్సిన్ ని అందిస్తున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ అందించిన తరువాత సంభవించిన వచ్చిన ఐదు అలెర్జీ ప్రతిచర్యల గురించి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి గత వారం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version