ఇండియాలో ఇంత పూర్ ఎమ్మెల్యే లేరేమో…?

సాధారణంగా రాజకీయాల్లో ఇప్పుడు నిలబడాలి అంటే రాజకీయం చేయాలి అంటే ప్రజల్లో బలం కంటే కూడా ఆర్ధికంగా బలంగా ఉండాలి అనే విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప్రజలు కూడా కమర్షియల్ గా ఆలోచన చేయడంతో రాజకీయ నాయకులు కూడా అలాగే వెళ్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో ఒక ఎమ్మెల్యే మాత్రం చాలా పూర్. ఆమె ఆస్తి తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే.

మూడు మేకలు, మూడు ఆవులు, ఒక గుడిసె, ఒక జనధన్ ఖాతా… మొత్తం 31 వేల రూపాయల ఆస్తులు…… బెంగాల్, సలోత్రా నుంచి గెలిచిన ఈ బీజేపీ అభ్యర్థి చందనా బౌరి ఆస్తులివి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. భర్త రోజువారీ కూలీ, ఈమె పనిమనిషి… వీసమెత్తు బంగారం లేదు, అప్పుల్లేవు, ఆస్తుల్లేవు, సైకిల్ కూడా లేదు… కేసుల్లేవ్, కాసుల్లేవ్… కనీసం పాన్ కార్డు కూడా లేదట.