న‌దిలో ప‌డిపోయిన ఎంపీ.. ఏం జ‌రిగిందంటే..

-

వరదలో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్న బాధితులను పరామర్శించి వారి క్షేమ సమాచారాలను తెలుసుకునేందుకు వెళ్లిన ఎంపీ తానే బాధితుడయ్యారు. బోటులో ప్రయాణిస్తూ నదిలోకి జారిపోయారు. స్థానికులు అప్రమత్తమై రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని పాట్నాకు సమీపంలో బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్ వరద బాధితులను పరామర్శించేందుకు బ‌య‌లుదేరాడు. ఈ క్ర‌మంలోనే బోటు ఒరగడంతో దాద్రా నదిలో పడిపోయాడు. అయితే, ఎలాంటి రక్షణలు లేకుండా ఈ బోటు ప్రమాదకరంగా ఉండటం, దానిపై ఐదారుగురు ప్రయాణించడంతో నీళ్లలో కొద్దిదూరం వెళ్లకముందే ఇది అదుపుతప్పి నీళ్లలో మునిగిపోయింది.

దానిపై ఉన్నవారంతా అమాంతం నీళ్లలో పడిపోయారు. దీంతో కొట్టుకుపోతున్న ఎంపీని స్థానికులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. అలాగూ ఈ ప్రమాదం నుంచి ఎంపీతోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాలకు సాయం అందించడానికే పరిమితమయ్యిందని, గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధిగా తాను గ్రామాల సందర్శనకు బోటు కూడా అందుబాటులో లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news