బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అంటే సరిపోదు అంటూ బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సమాజ సేవ కూడా చేయాలని అన్నారు. పార్టీలో పదవుల కోసం కొట్టుకోకుండా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు పని చేయాలి అంటూ కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీనం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని ఆయన ప్రశ్నించారు.