జగన్ ప్రధానమంత్రి అయినా.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు.. బీజేపీ ఎంపీ..!

-

రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని బేషజాలకు పోకుండా… ప్రత్యేక హోదానే కావాలి.. అనే పట్టుదలకు పోకుండా.. కేంద్రం ఇచ్చే ప్యాకేజీని తీసుకొని ఏపీని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఏపీ ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీకి సీఎంగా ఉన్న జగన్.. ప్రధానమంత్రి అయినా కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేల్చిచెప్పారు.

ఏపీ సీఎం జగనే కాదు.. మాజీ సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి అయినా సరే.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ర్టానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం అయ్యే పని కాదు.. అని సుజనా స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొన్న సుజనా పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని బేషజాలకు పోకుండా… ప్రత్యేక హోదానే కావాలి.. అనే పట్టుదలకు పోకుండా.. కేంద్రం ఇచ్చే ప్యాకేజీని తీసుకొని ఏపీని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.

టీడీపీ హయాంలో ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ దీక్షలు చేశారని సుజనా చౌదరి ఆరోపించారు. సుజనా చౌదరితో పాటు మరో ముగ్గురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు.. ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news