ఓరుగల్లు పోరు: కిక్కిరిసిన కారు.. కమలం జోరు!

-

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లో నేతలు ఫుల్ గా ఉన్నారనే చెప్పాలి..మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ లో పూర్తి స్థాయిలో నేతలు లేరు…పైగా బొటాబోటి మెజారిటీతోనే అధికారంలోకి వచ్చింది..దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి…టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, నేతలని పార్టీలో చేర్చుకుంది..అక్కడికే పార్టీ ఫుల్ అయింది. అయితే 2018 ఎన్నికల్లో గెలిచాక కూడా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ఆపలేదు..బంపర్ మెజారిటీ ఉన్నా సరే..కాంగ్రెస్, టీడీపీ వాళ్ళని లాగింది.

దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఒరిగింది ఏమి లేదనే చెప్పాలి…ఇప్పుడు కారు ఓవర్ లోడ్ అయ్యి..నేతల మధ్య రచ్చ జరుగుతుంది…ఒకో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు..ఒకరికి సీటు వస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు…లేదంటే సీటు రాదని ముందే తెలిస్తే పార్టీ మారిపోవడానికి చూస్తున్నారు. ఇక అలాంటి వారినే ఇప్పుడు బీజేపీ కూడా టార్గెట్ చేస్తుంది…టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న బలమైన నాయకులని పార్టీలోకి తీసుకోచ్చేందుకు చూస్తుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ కన్వీనర్ గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఇక ఆ కమిటీ…టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నేతలని లాగే పనిలో ఉంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టు ఉన్న వరంగల్ లో బలమైన నాయకులని లాగడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు..టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఎప్పటినుంచో టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా వేరే పార్టీల్లో నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప..పార్టీ లో ముందు నుంచి కష్టపడే వరకు పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదు..అందుకే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.

అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు బడా నేతలు సైతం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే కారు కిక్కిరిసిపోయిందని, అందులో ఉన్నవారికి ఊపిరి కూడా ఆడటం లేదని, త్వరలోనే వారు కారు దిగేసి కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి వరంగల్ లో సత్తా చాటాలని కమలదళం చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version