పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజు కు పెరగడంతో సామాన్యుడుపై పెనుభారం పడుతోంది. ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపట్టారు. ఈ నేపథ్యంలో భాజపా ట్విట్టర్ వేదికగా పెట్రోల్ ధరలకు సంబంధించిన ఓ పోస్ట్ ని తమ అధికారిక అకౌంట్ లో పెట్టింది.
ఇందులో 2004 నుంచి 2018 వరకు పెట్రోలు ధరల్లో పెరుగుదల శాతాన్ని వివరిస్తూ నరేంద్ర మోదీ ఫొటో తో కూడిన గ్రాఫిక్స్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ప్రజలకు జవాబు చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల పెరుగుదల సమర్థించుకుంటూ నాటి యూపీఎ కాలంలోనే అధికంగా పెరిగిందంటూ వారు పేర్కొనడం భాజపా దిగజారుడు తనానికి నిదర్శనంగా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Truth of hike in diesel prices! pic.twitter.com/gF7CWHeiti
— BJP (@BJP4India) September 10, 2018