పాతిక కోట్ల బిజినెస్.. అల్లుడా మజాకా..!

-

అక్కినేని నాగ చైతన్య, మారుతి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ పోశిస్తుంది శివగామి రమ్యకృష్ణ. టీజర్, ట్రైలర్ లతో అలరిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలుస్తుంది.

చైతు కెరియర్ లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా 25 కోట్లతో హయ్యెస్ట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు శైలజా రెడ్డి అల్లుడు సినిమా బిజినెస్ పాతిక కోట్లు జరగడం విశేషం. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా పక్కా హిట్ ఫార్ములాతో వస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఎక్కువే పెట్టేశారు. చైతు సరైన ట్రాక్ లో లేకున్నా మారుతి మీద నమ్మకంతో పాతిక కోట్లు బిజినెస్ జరిగింది.

ఇక ఈ సినిమా బిజినెస్ ఏరియాల వారిగా ఎలా ఉందో చూస్తే..

నైజాం : 6.50 కోట్లు
సీడెడ్ : 3.20 కోట్లు
వైజాగ్ : 2.40 కోట్లు
గుంటూరు : 1.73 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.55 కోట్లు
కృష్ణా : 1.50 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.25 కోట్లు
నెల్లూరు : 0.76 కోట్లు
ఏపీ+తెలంగాణ : రూ.18.89 కోట్లు
ఓవర్సీస్ : 3.40 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 2.25 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ.24.54 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news