ఎన్నికలు అయ్యాక సిఎంకు షాక్ ఇచ్చిన బిజెపి…?

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నవంబర్ 16 న ఏడవ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన ఈసారి అయిదేళ్ళ పాటు బీహార్ సిఎంగా ఉంటారా అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. బీహార్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఇప్పుడు కొన్ని షరతులు బిజెపి పెడుతుంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయని… బిజెపి, జనతాదళ్ యునైటెడ్ (జెడియు) సీనియర్ నేతలు చర్చిస్తున్నారు అని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, గవర్నర్‌ ను ఎప్పుడు కలవాలనే దానిపై ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో 125 సీట్లు గెలవడంతో ఎన్డియే అధికారంలోకి వచ్చింది. అయితే సిఎం పదవిని చెరో రెండున్నరేళ్ళు పంచుకునే అవకాశం ఉందని, ఈ కొత్త కండీషన్ బిజెపి జేడియు ముందు ఉంచుతుంది అని మీడియా వర్గాలు వెల్లడించాయి.