తెలంగాణలో డిగ్రీ, బీటెక్ ఫస్టియర్‌కు సంబంధించి క్లాసులను డిసెంబర్ 1 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికి యూనివర్సిటీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. క్లాసులు ఆన్‌లైన్‌లోనా లేక రెగ్యులర్‌గా నిర్వహించాలా అన్నదానిపై స్పష్టత వచ్చాక దీనిపై ప్రకటన చేయనుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 30 శాతం సిలబస్ తగ్గించాలని కూడా ఉన్నత విద్యామండలి ఆలోచిస్తుంది.
ఇక రెగ్యులర్ క్లాసులు ప్రారంభించాలంటే హాస్టళ్లు తెరవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఇప్పటికే సగం విద్యాసంవత్సరం వృదా అయింది. ఇక . కాలేజీ పనిదినాలను 180 నుంచి 150 వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయి.