బిజెపి మీద సెటైర్లు స్టార్ హీరో కొంప ముంచాయి…!

-

తమిళ సిని పరిశ్రమను ఇప్పుడు ఐటి దాడులు కుదిపేస్తున్నాయి. హీరో విజయ్ ని టార్గెట్ చేసిన ఐటి అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచి సోదాలు చేస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో ఉన్న విజయ్ ని అధికారులు విచారించి ఆ తర్వాత ఆయన్ను ఇంటికి పిలిచి అక్కడ కూడా విచారించారు. దాదాపు 20 గంటలుగా ఆయన్ను సుదీర్గంగా అధికారులు విచారించడం చర్చనీయంశంగా మారింది.

ఆయన ఇంట్లో రెండో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విజయ్ ఫైనాన్షియర్ అన్బు నుంచి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీనితో ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. విజయ్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ట్విట్టర్ ని షేక్ చేస్తుంది.

దీనితో తమిళ సిని పరిశ్రమ ఒక్కసారిగా కలవరానికి గురైంది. ఆయన వరుసగా మూడు సినిమాల్లో బిజెపిని టార్గెట్ చేసి సెటైర్లు వేసారు. దీనితోనే ఆయన్ను బిజెపి టార్గెట్ చేసిందని అంటున్నారు. ఇక మిగిలిన సిని ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. బిగిల్ సినిమా లావాదీవల గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఎజీఎస్ కార్యాలయంలో అధికారులు 24 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మేనేజర్ ని అధికారులు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news