భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని.. రిజర్వేషన్లను తొలగించదని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తుందని.. రాజ్యాంగ ప్రవేశికను కాషాయ పార్టీ మార్చాలని చూస్తుందని ఇటీవల ఆరోపించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 1976లో భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారని.. ఇప్పుడు అనవసరంగా బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు.
అవసరం అయినప్పుడు రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేయవచ్చు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు అలాగే చేశాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబోమని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలో ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం ప్రకారం.. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లన అసలు అనుమతించమని వెల్లడించారు.