దేశంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమినే అధికారంలోకి వస్తుందని.. దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల ఎన్నికల్లో దేశ ప్రజలు ఎక్కువగా బీజేపీ వైపే మొగ్గు చూపారని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ-ఎన్డీఏ తుఫాన్ వీస్తుందని తెలిపారు.
ఇండియా కూటమి కులతత్వం, మతతత్వంతో కూరుకుపోయిందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు ఉంటారని తెలిపారు. అలాంటి వారు దేశాన్ని బలోపేతం చేయగలరా..? అని ప్రశ్నించారు. సమాజ్ వాద్ పార్టీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే పరిమితమయ్యారని ఆరోపించారు. పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్నారని తెలిపారు. బీజేపీ అనుసరించిన విధానాల వల్లనే మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందన్నారు.