Up mlc elaction results: ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి హవా..

-

ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బిజెపి మరోసారి తన సత్తా చాటింది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లోను తనదైన ముద్ర వేసింది.యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లొని లోకల్ అథారిటీ ఏరియా లోని 36 స్థానాల్లో 33 స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది.ఈ భారీ విజయంతో ఇప్పుడు యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పై స్పష్టమైన ఐక్యతను సంపాదించింది.దీంతోపాటు ముగ్గురు స్వతంత్రులు కూడా విజయం సాధించారు.36 యూపీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

yogi-adityanath
yogi-adityanath

దీంతో 27 శాసనమండలి స్థానాల్లో95 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.9 మంది ఏకగ్రీవం కాగా మిగిలిన 27 స్థానాలకు గత శనివారం పోలింగ్ జరిగింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోబిజెపి వరుసగా రెండోసారి భారీ మెజార్టీతో గెలుపొందగా ఇప్పుడు శాసనమండలిలోనూ మెజారిటీ సాధింంచింది.బీజేపీ భారీ విజయం పైఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.ఈ మేరకు యోగి ట్విట్టర్లో పేర్కొన్నారు.”ఈరోజు ప్రదేశ్ స్థానిక అధికార శాసనమండలిఎన్నికల్లో బిజెపి సాధించిన భారీ విజయం రాష్ట్ర ప్రజలు జాతీయవాదం,అభివృద్ధి, సుపరిపాలన తో సమర్థ మార్గదర్శకత్వమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నారని మళ్లీ స్పష్టం చేసింది”అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news