ఆ ఫోటోలు తీశారు.. 100 మంది బాలికలను బ్లాక్ మెయిల్ చేశారు..!

-

whatsapp hacking blackmailers got arrested
whatsapp hacking blackmailers got arrested

ఇంటర్ పాసయ్యాడు.. వ్యసనాలకు డబ్బు కావాలి, అమ్మాయిలతో వాట్సప్ లో చాట్ చేస్తాడు సమాచారాన్ని హ్యాక్ చేస్తాడు చివరికి బ్లాక్ మెయిల్ చేస్తాడు.. బ్లాక్ మెయిల్ చేయడమే తన ముఖ్య వ్యవహారంగా ఎంచుకున్నాడు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా 100 మంది బాలికలను బ్లాక్ మెయిల్ చేశాడు. 100 మంది దగ్గర తరచూ డబ్బులు వసూళ్లు చేస్తూ ఇవ్వకపోతే తమ వ్యక్తిగత ఫోటోలను సమాచారాన్ని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించాడు. చివరికి పాపం పండింది విషయం బయటపడింది.. పోలీసులకు చిక్కాడు ఇప్పుడు ఊచలు లెక్కబేడుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో నివసించే సత్తార్‌ఖాన్‌ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. నకిలీ ఆధార్‌కార్డులతో సిమ్‌ కార్డ్స్‌ను సమకూర్చేవాడు. ఇక అతని మిత్రులు మనీశ్‌, పూజా సత్తార్ ఖాన్ ద్వారా ఫోన్ నంబర్లు సంపాదించి మెల్లిగా బాలికలను ట్రాప్ చేస్తారు. ఆ బాలికతో చోరువగా మాట్లాడి ఆ బాలిక వ్యక్తిగత ఫోటోలు సమాచారం హ్యాక్ చేస్తారు.. అలా హ్యాక్ చేసి దాదాపుగా 100 మందికిపైగా బాలికలను బ్లాక్ మెయిల్ చేశారు వారి దగ్గరనుండి దండిగా డబ్బులు వసూళ్లు చేశారు. కాగా వీరి భారిన పడ్డ ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరిదాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కొంతమంది స్కూలు, కాలేజీ విద్యార్థులతో స్నేహం ఏర్పరుచుకొని ఎలాగోలా వారి నుంచి బాలికల ఫోన్‌ నంబర్లు తీసుకునేవారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు మైనర్ గా ఉండటం గంనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version