కొత్తరకం అటెండెన్స్ కు శ్రీకారం చుట్టిన GHMC..!

-

ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ కు శ్రీకారం చుట్టింది GHMC. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ లో క్యాప్చర్ చేసింది ఐటీ విభాగం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై పని చేయనుంది ఫేషియల్ అటెండెన్స్. మొత్తం 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరు కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ కు సిద్ధం చేస్తుంది GHMC.

ఇప్పటికే GHMC పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024 నుండి అమలు చేస్తున్నారు. పారదర్శక, కచ్చితత్వంతో కూడిన హాజరు నమోదుకు తోడ్పడుతుందని GHMC నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి కార్యాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయాలతో సహా నమోదవ్వనుంది. కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలతో రెండు గేట్ల ప్రవేశ ద్వారాల వద్ద క్యాప్చుర్ చేసే కెమెరాలు ఏర్పాటు చేసారు. అమర్చిన కెమెరా లో ఫోటో క్యాప్చర్ చేసి ఎంప్లాయ్ ఐడి నెంబర్ అటెండెన్స్ సమయం నమోదు అయ్యేలా ఏర్పాటు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version