తెల్లవారుజామున పేలుడు.. జమ్మూ ఎయిర్‌పోర్టులో హై అలెర్ట్

-

జమ్ముకశ్మీర్‌: జమ్ము విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పేలుడులో కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి ఎయిర్ పోర్టులోని ఓ భవనం పైకప్పు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌లో ఏ మేర‌కు నష్టం వాటిల్లిందో ఇంకా వెల్ల‌డికాలేదు. విషయం తెలుసుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. ఎయిర్ చీఫ్ మార్షల్‌తో మాట్లాడారు. కాసేపట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.

 

అయితే శనివారం వైమానిక దళం నియంత్రణలో ఉన్న విమానాశ్రయ సాంకేతిక ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. తొలుత ఇది ఉగ్రవాదుల చ‌ర్య కావచ్చ‌ని అధికారులు భావించారు. తాజాగా మరో ఘటన జరగడంతో ఎయిర్ పోర్టులో కలకలం రేగింది.

Read more RELATED
Recommended to you

Latest news