కుటుంబ పెన్షన్ రూల్స్: రూల్స్ ని అతిక్రమించద్దని బ్యాంకులను కోరిన ప్రభుత్వం..!

-

కుటుంబ పెన్షన్ కేసులను బ్యాంకులు పరిష్కరించడం కాస్త కష్టంగా ఉంటోంది. అయితే ప్రస్తుతం పెన్షనర్ మరణించిన తరువాత మరణించిన పెన్షనర్ యొక్క పార్ట్నర్ ని కానీ లేదా కుటుంబ సభ్యులను కానీ వివరాలు మరియు పత్రాలను సమర్పించమని పెన్షన్ పంపిణీ బ్యాంకులు కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే న్యాయంగా చూస్తే అవి కుటుంబ పెన్షన్ ని స్టార్ట్ చెయ్యడానికి అవసరం లేదు. ఇది జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల వేధింపులకు సమానం మరియు తరచుగా బ్యాంకులు కుటుంబ పెన్షన్ ప్రారంభించడంలో చాల ఆలస్యం చేస్తున్నారు.

ది డిపార్ట్మెంట్ అఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అండర్ మినిస్ట్రీ అఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రిఎవాన్స్స్ అండ్ పెన్షన్స్ పరిస్థితిని గమనించి కుటుంబ పెన్షన్ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని అన్ని బ్యాంకులకు ఒక నోట్ జారీ చేసింది.

మరణించిన పెన్షనర్‌కు జారీ చేసిన పిపిఓలో పార్ట్నర్ లేదా కుటుంబ సభ్యుడు, కుటుంబ పింఛను ప్రారంభించడానికి వీటిని మాత్రమే ఇవ్వాలి.

జాయింట్ ఎకౌంట్ అయితే వీటిని ఇవ్వండి:

కుటుంబ పెన్షన్ ప్రారంభించడానికి ఒక సాధారణ లేఖ లేదా దరఖాస్తు
మరణించిన పింఛనుదారుని డెత్ సర్టిఫికెట్
అందుబాటులో ఉంటే పింఛనుదారునికి జారీ చేసిన పిపిఓ కాపీ
దరఖాస్తుదారుడి వయస్సు, పుట్టిన తేదీ ప్రూఫ్
కుటుంబ పెన్షన్ ప్రారంభించడానికి జీవిత భాగస్వామి / కుటుంబ సభ్యులు ఫారం 14 లోని వివరాలను బ్యాంకుకు సమర్పించాల్సిన అవసరం లేదు.

జాయింట్ ఎకౌంట్ కాకపోతే:

ఇద్దరు సాక్షుల సంతకాలను కలిగి ఉన్న ఫారం 14 లోని దరఖాస్తు
మరణించిన పింఛనుదారునికి సంబంధించి డెత్ సర్టిఫికెట్
అందుబాటులో ఉంటే పింఛనుదారునికి జారీ చేసిన పిపిఓ కాపీ
దరఖాస్తుదారుడి వయస్సు లేదా పుట్టిన తేదీ ప్రూఫ్
ఫారమ్ 14 ను గెజిటెడ్ అధికారి ధృవీకరించడం అవసరం లేదు.

పింఛనుదారు మరియు జీవిత భాగస్వామి మరణించినప్పుడు, కుటుంబ పెన్షన్ మరొక కుటుంబ సభ్యునికి ఇవ్వాలి.

ఇతర కుటుంబ సభ్యులకు పిపిఓలో కుటుంబ పెన్షన్ కోసం సహ-అధికారం ఉంటే, పైన పేర్కొన్న విధానాన్ని అనుసరిస్తారు.
ఒకవేళ పేరు పిపిఓలో చేర్చబడకపోతే ప్రభుత్వ సేవకుడు / పెన్షనర్ పనిచేసిన కార్యాలయాన్ని సంప్రదించమని సలహా ఇవ్వవచ్చు.

పెన్షన్ చెల్లించే శాఖలకు తగిన సూచనలు జారీ చేయాలని అన్నారు. అలానే కనీస అవసరమైన వివరాలు, కుటుంబ పెన్షన్ హక్కుదారుల నుండి పత్రాలు మాత్రమే పొందాలని.. ఎటువంటి వేధింపులకు గురికాకుండా చూసుకోవాలని ఈ విభాగం బ్యాంకులను కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news