పడిపోయిన రక్తనిల్వలు.. ఆందోళనలో రోగులు!

-

ప్రస్తుతం భారత్‌లో రక్తనిల్వలు విపరీతంగా పడిపోయాయి. దీంతో ప్రతిఒక్క డోనర్‌ను కాంటాక్ట్‌ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్లడ్‌ స్టాక్‌ తగ్గడానికి ప్రధాన కారణం లాక్‌డౌన్, కొవిడ్‌ 19. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి కూడా బ్లడ్‌ కొరత ఏర్పడిందని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. రక్తం కొరత ఏర్పడినందుకు ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధ పడుతున్నవారు ఆందోళన చెందుతున్నారు.

 

ప్రధానం తలసేమియా, డయాలసిస్, గర్భవతలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఏదైనా అత్యవసర శాస్త్ర చికిత్స చేయాలంటే కూడా బ్లడ్‌ నిల్వలు లేవు. దీంతో పరిస్థితి చేజారిపోతుంది. అందుకే బ్లడ్‌ డోనర్‌లను గుర్తించి.. అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ వారిని రక్తదానం కోసం సంప్రదిస్తున్నారు. బీ పాజిటివ్‌ బ్లడ్‌ విపరీతంగా కొరత ఏర్పడిందని ద్వారకాలోని మణిపాల్‌ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెండ్‌ వైద్యుడు హిమాన్షు లాంబా తెలిపారు.ఆస్పత్రి వర్గాలు వ్యక్తిగతంగా డోనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. బ్లడ్‌ ఇవ్వడానికి మెడికల్‌ సెంటర్‌కు రాలేని డోనర్ల కోసం ప్రత్యేకంగా ప్రయాణ సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు.

తలసేమియా రోగుల మద్ధతుదారులైన ఎన్‌జీఓస్‌ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఈ విషయం గురించి రిక్వెస్ట్‌ చేశారు. వారి పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వారు తరచూ బ్లడ్‌ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చేసారి రక్తం దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారు సైతం కొవిడ్‌ నేపథ్యంలో క్యాంప్‌ను నిలిపివేశారు. వీళ్ల ద్వారా దాదాపు 900 మందికి బ్లడ్‌ అందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై ఏ చర్య తీసుకుంటుందని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం పనిచేస్తున్న శోభ తులి ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ వల్ల డోనర్సు బ్లడ్‌ ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆమె అంటున్నారు.

కొంతమంది రక్త దాతలకు ఆస్పత్రిలోకి కూడా అనుమతి ఇవ్వడం లేదని, మరికొంత మంది రక్తదానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని ముందుకు రావడం లేదన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సెక్రటరీ జనరల్‌ ఆర్‌.కె.జైన్‌ మాట్లాడుతూ బ్లడ్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరిగినా.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. మామూలు శస్త్ర చికిత్సలను బ్లడ్‌ నిల్వలకు కొరత ఉన్న ప్రదేశాల్లో నిలిపివేశామన్నారు. 24 గంటలు కంట్రోల్‌ రూం ద్వారా బ్లడ్‌ డోనర్లను సంప్రదిస్తూనే ఉన్నామన్నారు. ఢిల్లీలో దాదాపు 38 వేల మంది బ్లడ్‌ డోనర్లు ఉన్నారన్నారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ కూడా దీనిపై స్పందిస్తూ ఆస్పత్రుల్లో బ్లడ్‌ నిల్వలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వాలంటరీ దాతల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version