ప్రాణాలు తీసే వాళ్లకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాన్లు…!

-

వాళ్ళు ఇద్దరూ ఎదురు పడ్డారు అంటే అక్కడ రక్తపాతమే. శాంతి అనే పధం ఎక్కడ వెతికినా సరే కనపడే అవకాశం ఉండదు. వాళ్ళను వీళ్ళు చంపడమా…? లేక వాళ్ళ చేతిలో వీళ్ళు చావడమా…? ఈ రెండే గాని కొత్త విధానం ఉండదు. అలాంటిది రక్తదానం ఒకరికి ఒకరు చేసుకున్నారు. ఇంతకు వాళ్ళు ఎవరా అంటారా…? మావోయిస్ట్ లు సిఆర్పీఎఫ్ జవాన్ లు. మావోలకు వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది.

అవును ఇది నిజం. శుక్రవారం జార్ఖండ్ లో మావోలకు బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులను జవాన్లు కాల్చి చంపగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో టాటానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు జవాన్ లు. అయితే వారికి రక్తదానం అవసరమయింది. దీనితో సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లైన ఓం ప్రకాశ్ యాదవ్, సందీప్ కుమార్ ఇద్దరూ రక్త దానం చేయడానికి ముందుకు వచ్చారు.

నక్సలైట్ల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని రక్తదానం చేయడం చాలా అవసరం అని చెప్పారు. దీనితో ముందుకు వచ్చి వారు రక్తదానం చేయగా ఆ ఇద్దరి ప్రాణాలు కాపాడారు వైద్యులు. దీనిపై స్పందించిన జవాన్ లు దేశాన్ని రక్షించే క్రమంలో తాము కాల్పులు జరుపుతామని వారి మీద తమకు ఏ కోపం లేదని అన్నారు. వారికి రక్తదానం చేయడం చేయడం చాలా గర్వంగా ఉందని, వారి ప్రాణాలను తయు కాపాడామని చెప్పారు. ఇద్దరినీ ఉన్నతాధికారులు అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version