షాకింగ్ : డ్వాక్రా మ‌హిళ‌ల గ్రూప్ లో అశ్లీల చిత్రాలు.. !

-

డ్వాక్రా వెలుగు’ గ్రూపులో అశ్లీల దృశ్యాలు కలకలం రేపాయి. కృష్ణా జిల్లాలోని చాట్రాయి వెలుగు గ్రూప్ లో ఏపియం బాలసుబ్రమణ్యం అశ్లీల వీడియోల‌ను పోస్ట్ చేశాడు. దాంతో గ్రూప్ లో ఉన్న స‌భ్యులంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. గ్రూప్ లో అంద‌రూ మ‌హిళ‌లే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏపీయం కావ‌డంతో బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆ గ్రూపులో ఉన్నారు. కాగా మహిళల గ్రూప్ లో నీలి వీడియో పంపడంపై మహిళా సభ్యులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

blue films in dwakra group
blue films in dwakra group

ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారుల‌కు వెలుగు సంఘాలు ఫిర్యాదు చేశాయి.బాల సుబ్ర‌మ‌ణ్యం ను గ్రూప్ నుండి వెలుగు లో ఉన్న త‌న ఉద్యోగాన్ని తీసేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. గ్రూప్ లో డ్వాక్రా ప‌థ‌కానికి సంబంధించిన అంశాలను మీటింగ్ లు నిర్వ‌హించుకునే స‌మయాన్ని తెలపడానికి ఈ గ్రూప్ ను క్రియేట్ చేశారు. అయితే అలాంటి గ్రూప్ లో వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ‌టంతో సుబ్ర‌మ‌ణ్యంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news