కాబూల్ లో దారుణం : విమాన చక్రాలు మధ్య శరీర భాగాలు

-

కాబూల్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానిక దళ కార్గో విమానంపై ఎక్కేందుకు… ఆఫ్ఘన్ ప్రజలు ఎగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కింద పడ్డారు. ఆ దృశ్యాలు అందర్నీ కలచివేశాయి. అయితే సీ – 17 గ్లోబ్ మాస్టర్ సైనిక విమానం పై ఎక్కిన కొందరు ఆఫ్ఘన్ ప్రజలు…. దాని వీల్ భాగంలో దాక్కున్నారు.

సుమారు 600 మంది తో వెళ్ళిన ఆ విమానం… ఖతార్ లోని ఆల్ ఉబెఈద్ ఎయిర్ బేస్ లో దిగింది. కానీ ఆ విమానం అక్కడ దిగిన తర్వాత వైమానిక దళ సభ్యులకు మరో షాక్ తగిలింది. విమాన చక్రం (వీల్) భాగంలో మానవ శరీర భాగాలు మరియు అవయవాలు… ఓ మాంసం ముద్దుల కనిపించినట్లు వైమానిక దళం పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటన చూసిన నెటిజన్లు… ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news