బ్రేకింగ్ : భద్రాద్రి కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో ప్రమాదం : ముగ్గురు మృతి

ఓపెన్ కాస్ట్ లో అనుకోని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరిగింది. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ 2 గనిలో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు సింగరేణి ఉద్యోగస్తుల తో పాటు ఒక డ్రైవర్ మృతి చెందారు. మణుగూరు లోని పీకే ఓపెన్ కాస్ట్ బొలెరో మీదికి దూసుకొని వెళ్లడంతో బొలెరో లో ప్రయాణం చేస్తున్న ఇద్దరు సింగరేణి ఉద్యోగుల తో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు తీయటానికి నూట పది టన్నుల దంపర్ పని చేస్తుంది.

బొగ్గును తీసి లారీ లో వేయటానికి అటు ఇటు తిరుగుతుంది .అదే సందర్భంలో ఓపెన్ కాస్ట్ లో అత్యవసర పనుల కోసం బొలెరో తిరుగుతుంటుంది. బొలెరో తిరుగుతున్న సందర్భంలోనే బొలెరో పైకి దంపర్ ఎక్కింది. దీంతో బులోరా నలిగిపోయింది. మృతులంతా బొలెరో అడుగుభాగం లోని ఉండిపోయారు .వారిని బయటకు తీయటానికి బుల్లోరా ని గ్యాస్ వెల్డింగ్ లతో బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి రెండు మృత దేహాలను వెలికి తీయగా మరో మృతదేహం ఇంకా లభించలేదు. ఈ ఘటనపై ఇప్పటివరకు సింగరేణి అధికారులు మాత్రం స్పందించలేదు. మృతుల్లో ముగ్గురు మణుగూరు కి చెందిన వ్యక్తిగా గుర్తించారు .