బొగత జలపాతాన్ని సందర్శించేందుకు సరైన సమయం వర్షాకాలమే. ఇప్పటికే వర్షాలు ప్రారంభం అయ్యాయి. పర్యాటకులు కూడా బొగత జలపాతానికి క్యూ కడుతున్నారు.
ఈ వర్షాకాలం సీజన్ లో ఎక్కడికైనా టూర్ వేయాలనుకుంటున్నారా? మీది తెలంగాణ అయినా.. ఆంధ్రా అయినా, రాయలసీమ అయినా.. ఎక్కడ ఉన్నా… ఈ వర్షాకాలం సీజన్ లో టూర్ వేయాలనుకుంటే మీకు ఓ అద్భుతమైన జలపాతం ఉంది. దాని పేరే బొగత జలపాతం.
ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఇదే సరైన సమయం. వర్షాల వల్ల వచ్చే వరదలు పైనుంచి జాలు వారుతూ ఉంటే.. చూసి తరించాల్సిందే. బొగత జలపాతంతో పాటు చుట్టూ ఉన్న అడవి అందాలను కూడా ఆస్వాదించవచ్చు.
బొగత జలపాతాన్ని సందర్శించేందుకు సరైన సమయం వర్షాకాలమే. ఇప్పటికే వర్షాలు ప్రారంభం అయ్యాయి. పర్యాటకులు కూడా బొగత జలపాతానికి క్యూ కడుతున్నారు.
ఇది తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉంది. దీన్ని తెలంగాణ నయగార జలపాతం అని కూడా పిలుస్తారు. ఇది తెలంగాణలోనే రెండో అతి పెద్ద జలపాతం.
బొగత జలపాతం ఒక పిక్ నిక్ స్పాట్ లాంటిది కూడా. చాలామంది పర్యాటకులు బొగతకు వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదించి అక్కడే వండుకొని తింటారు.
ఇంతకీ బొగతకు ఎలా వెళ్లాలంటే.. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. భద్రాచాలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్రా నుంచి వచ్చే వాళ్లు భద్రాచలం నుంచి వెళ్లొచ్చు. ప్రైవేటు వాహనాల్లో వచ్చేవాళ్లు.. భద్రాచలంలో బొగత రూట్ తెలుసుకోవచ్చు. ఇక.. ములుగు నుంచి 90 కిలోమీటర్లు. ములుగు నుంచి బొగతకు బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాల సౌకర్యం ఉంటుంది. వరంగల్ నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి 329 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.