తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ లో బీజేపీ పార్టీ కుట్రలను ప్రజలు గ్రహించారని.. బీజేపి అధికారంలో లేని రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్ లు పవర్తన బాలేదని నిప్పులు చెరిగారు. గవర్నర్ తమిళ్ సై శాసన మండలి బిల్లులు ఎందుకు ఆమోదం తెలపలేదో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ యూనివర్సిటీలలో 2 వేల ఖాళీ ఉద్యోగాల నియామకం బిల్లు ఉందన్నారు. సియం కేసీఆర్ ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నానని చెప్పారు. మునుగోడు లో టి ఆర్ యస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై జనం నిరసన తో ఉన్నారని.. ట్యాక్సీ కట్టే సంపన్న వర్గాలకు మద్దతుగా మోడీ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.పుట్టిన ప్రతి పౌరుడు ఇన్ డైరెక్ట్ గా ట్యాక్సీ కడుతున్నాడు దాని గురుంచి మోడీ పట్టించుకోరని ఆగ్రహించారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి ఖర్చు పెట్టొద్దని బిల్లు తీసుకు వచ్చారని నిప్పులు చెరిగారు.