పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ తో పాటు కై పో చే చిత్రాలలో నటించిన ఆసిఫ్ బాస్రా 53 ఏళ్ళ వయసులో కన్ను మూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఒక ప్రైవేట్ కాంప్లెక్స్‌లో అతను చనిపోయి ఉన్నాడు. ఆయన ఉరివేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎస్‌ఎస్‌పి కాంగ్రా విముక్త్ రంజన్ మాట్లాడుతూ ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలంలో ఉందని, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఆసిఫ్ చివరి సారిగా డిస్నీ హాట్స్టార్ వెబ్ సిరీస్ హోస్టేజెస్ రెండవ సీజన్లో కనిపించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పాతాళ్ లోక్ లోని మీడియా హౌస్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఈయన నటించారు. జబ్ వి మెట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, క్రిష్ 3, ఏక్ విలన్ మరియు అనేక ఇతర సినిమాలలో కూడా ఆసిఫ్ కనిపించాడు. నటుడు ఆసిఫ్ బాస్రా గత 5 సంవత్సరాలుగా మెక్లియోడ్ గంజ్ లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు చెబుతున్నారు. అతనితో పాటు ఒక విదేశీ స్నేహితురాలు కూడా నివసిస్తోందని చెబుతున్నారు. దీని మీద పూర్తి సమాచారం అందాస్లి ఉంది.