నగ్నంగా బర్త్ డే చేసుకున్న బాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్..!

సాధారణంగా సినీ సెలబ్రిటీల బర్త్ డే అంటే ఎప్పుడు కాస్త డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలకు వెళ్లి తన పుట్టిన రోజు జరుపుకుంటారు ఎంతో మంది సెలబ్రెటీలు. ఇక్కడ ఓ బాలీవుడ్ సెలబ్రెటీ ఇలాగే తన పుట్టిన రోజును కాస్త డిఫరెంట్గా జరుపుకోవాలి అని అనుకున్నాడు. గోవా బీచ్ లో పుట్టినరోజు జరుపుకున్నాడు .

సాధారణంగా కాదు నగ్నంగా… ఏకంగా నగ్నంగా బీచ్ లో పరుగులు పెడుతూ పుట్టినరోజు జరుపుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ . ఇటీవలే తన 55వ పుట్టినరోజు సందర్భంగా గోవా బీచ్ లో నగ్నంగా పరిగెడుతున్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 55 సంవత్సరాల వయసులో కూడా పరిగెడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.