బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లి డేట్ ఫిక్స్ … !

-

బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న పరిణీతి చోప్రా గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. కానీ అప్పటి నుండే మీడియాలో వీరిద్దరిపై వరుస కథనాలు సోషల్ మీడియాలో వస్తున్నా … మా మధ్య అలాంటిది ఏమీ లేదు, మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెబుతూ వచ్చారు, కానీ సడెన్ గా ఈ సంవత్సరం మే 13వ తేదీన ఢిల్లీ లో కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్ సమక్షములో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఎప్పుడెప్పుడు పెళ్లి ముహూర్తం జరుగుతుందా అని అంతా ఎదురుచూస్తుండగా, తాజాగా వీరి పెళ్లి ముహుర్తాన్ని ఖరారు చేశారు. సెప్టెంబర్ 23 మరియు 24 తేదీలలో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న లీల ప్యాలస్ లో వివాహం జరగనుంది.

ఈ పెళ్ళికి కేవలం వరుడు మరియు వధువు కుటుంబ సభ్యులు , బంధువులు , VVIP లు మరియు దగ్గర స్నేహితులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి ముగిసిన అనంతరం గురుగ్రామ్ లో రిసెప్షన్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version