అంబులెన్స్ కు దారి ఇవ్వలేదు…2.5 లక్షల జరిమానా విధించిన కేరళ పోలీసులు !

-

అంబులెన్స్ కు దారి ఇవ్వలేదని…2.5 లక్షల జరిమానా విధించారు కేరళ పోలీసులు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంబులెన్స్ సైరన్ వినగానే అందరికి ఒకే ఆలోచన వస్తుంది. ఒకరికో ప్రమాదం జరిగిందని అందరూ అనుకుని.. సైడ్‌ ఇస్తాం. ఏ ట్రాఫిక్ జామ్ అయినా సరే, అంబులెన్స్ సైరన్ వినగానే, ఆ కారు వెళ్లేందుకు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది.

Kerala Police fined 2.5 lakhs to the driver who stopped the ambulance from overtaking

కారులో ఉన్న వ్యక్తికి ప్రతి నిమిషం ముఖ్యం. అందుకే ట్రాఫిక్‌ కూడా క్లియర్‌ చేస్తారు. కానీ కేరళ రాష్ట్రంలో ఓ వ్యక్తి అలా చేయలేదు. అంబులెన్స్‌ కు సైడ్‌ ఇవ్వలేదు. ఆ అమానవీయ చర్యపై పోలీసులు కొరడా విధించారు. అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. పదేపదే అంబులెన్స్ హరన్ కొట్టినా.. దారి ఇవ్వని వాహనదారుడిపై చర్యలు తీసుకున్నారు. లైసెన్స్ క్యాన్సిల్ చేసి, 2.5 లక్షల జరిమానా విధించారు కేరళ పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version