మహారాష్ట ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి.. ప్రచారాలు ముగియబోతున్న తరుణంలో తెలుగు రాజకీయ నేతలు పినీషింగ్ టచ్ ఇస్తున్నారు.. తెలుగు ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు రెండు కూటములు పక్కా ప్లాన్ తో తెలుగు నేతలచేత ప్రచారాలు చేయిస్తున్నాయి.. మా పార్టీలకు మద్దతు ఇవ్వండంటూ ఏపీ, తెలంగాణ నేతలు మహారాష్టలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు..
లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. అన్నట్లుగా మహారాష్ట పొలిటికల్ క్లయిమాక్స్ లో తెలుగు నేతలు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.. తెలుగు ఓటర్లు ఎక్కువ గాఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలను హీటెక్కిస్తున్నారు. తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపిద్దామంటూ ఎవరికి వారు తమ పార్టీల తరపున ప్రచారాలు నిర్వహిస్తున్నారు.. మహాయుతి కోసం బిజేపీ నేతలు, టీడీపీ నేతలు ప్రచారాలు నిర్వహిస్తుంటే.. మహావికాస్ అఘాడియా కోసం కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.. దీంతో ఓవర్ టు మహారాష్ట అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి..
తెలంగాణాలో సక్సెస్ అయిన గ్యారెంటీలు మహారాష్టలో అమలు అవ్వాలంటే మహావికాస్ అఘాడియాను గెలిపించాలని కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. కొందరు మంత్రులైతే..తెలుగువాళ్లు ఉండే నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తూ అక్కడే మకాం వేసి.. ప్రచారాలను పర్యవేక్షిస్తున్నారు.. ఒక్క అవకాశమిస్తే.. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో చూడొచ్చని చెబుతున్నారు..
మరాఠి గడ్డపై ఆఖరి పోరాటంలో తెలుగు నేతలే హవా చాటుతున్నారు.. ఏపీ, తెలంగాణ పొలిటికల్ స్టార్స్ అందరూ.. బార్డర్స్ దాటి మరాఠా గడ్డపై జరిగే పొలిటికల్ పైట్ లో సత్తా చాటుతున్నారు
మహాయుతి తరపున తెలంగాణ బిజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లో ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఆయనతోపాటు.. పలువురు సీనియర్లకు కూడా బాధ్యతలు అప్పగించింది కమలం పార్టీ నాయకత్వం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరట్వాడా,విదర్బ, పశ్చిమ మహారాష్టపై పవన్ కళ్యాణ్ గురి పెట్టారు.. ఆయన్ని బిజేపీ అగ్రనాయకత్వం ప్రచారాలను పీక్స్ కు పంపేందుకు రంగంలోకి దింపింది.. మరాఠా గడ్డపై దాదాపు 14 లక్షల మంది తెలుగువాళ్ల ఉన్నట్లు తెలుస్తోంది.. వారందరినీ ఆకట్టుకునేందుకు రెండు కూటములు తమ నేతల చేత ప్రచారాలు చేయిస్తోంది.. ఎవరి వ్యూహాలు వర్కౌట్ అవుతాయో మరి..