Bollywood:’రామాయణము’ రెండు కాదు.. 3 పార్టులు

-

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని ఎదురుచూస్తున్నారు. రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

‘రామాయణ’ 2 పార్టులు కాదు.. 3 పార్టులుగా రానుందట. ఈమేరకు చిత్రయూనిట్ నుంచి విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు టైమ్స్ నౌ పేర్కొంది. మొదటి భాగంలో సీతారాముల కళ్యాణం, రెండో పార్టులో సీతాపహరణం, మూడో పార్టులో సీతను తీసుకురావడం చూపించనున్నట్లు తెలిపింది. మూడు భాగాలను డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కించనున్నారు.ఈ మూవీలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.అయోధ్య యువ రాజుగా సాంప్రదాయ దుస్తుల్లో రణ్‌బీర్, యువరాణి సీతగా సాయి పల్లవి ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news