ఇకపై ఉబర్ బస్సు సేవలు..తొలుత ఎక్కడంటే?

-

ఫేమస్ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ త్వరలో బస్సు సేవలను ఢిల్లీలో తొలుత ప్రారంభించనుంది. ఢిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌ కింద ఇకపై బస్సులను నడుపుటకు డిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్‌ అందుకుంది.

 

ఈ తరహా లైసెన్స్‌ జారీ చేసిన తొలి రవాణా శాఖ డిల్లీనే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్‌ నిలిచింది.ఏడాదిగా ఢిల్లీ -ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్‌ షటిల్‌ ఇండియా హెడ్‌ వెల్లడించారు. ఢిల్లీ లో బస్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్‌ చేసుకోవచ్చని ,బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్‌ లొకేషన్‌, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్‌ యాప్‌లో తెలుసుకోవచ్చని తెలిపింది. ఒక్కో సర్వీసులో 19-50మంది ప్రయాణించడడానికి వీలుంటుందని ,ఉబర్‌ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news