Breaking: రాజ్‌భవన్‌పై బాంబు దాడి

-

చెన్నైలో రాజ్‌భవన్‌ పై ఓ వ్యక్తి పెట్రోలు బాంబులతో దాడికి దిగడం కలకలం రేపింది. నిందితుడిని రౌడీ షీటర్ వినోద్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గేట్ల పై బాంబులు విసురుతున్న సమయంలోనే అతడిని పట్టుకున్నామని వెల్లడించారు. కాగా.. ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. శాంతిభద్రతల్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రోడ్లపై క్రిమినల్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు అదుపు చేయడం, శాంతిభద్రతలు పరిరక్షించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. వివరాల్లోకి వెళితే, తమిళనాడు రాజ్‌భవన్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు దాడి జరిగింది.

Petrol Bomb Attack On Rajbhavan : రాజ్​భవన్​పై పెట్రోల్​ బాంబు దాడి..  గవర్నర్​పై కక్ష పెంచుకుని.., petrol-bomb-attack-on-rajbhavan-tamilnadu -man-throws-petrol-bomb-at-tamil-nadu-raj-bhavan-accused-arrested

చెన్నైలోని గిండీలోని గవర్నర్‌ హౌస్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించిన ప్రముఖ రౌడీ కరుక్క వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించినట్లు కరుక్క వినోద్‌ అంగీకరించాడు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 25) సాయంత్రం 4 గంటలకు చెన్నైలోని గిండిలో ఉన్న రాజ్ భవన్ గేట్ నంబర్ వన్ వద్దకు వచ్చిన ఒక వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబును విసిరాడు. రాజ్ భవన్ గేట్ సెక్యూరిటీ పోలీసులు నిలబడి ఉండగా, అకస్మాత్తుగా తన చేతిలోని పెట్రోల్ బాంబు విసరడంతో అది గేటు దగ్గర పడిపోయింది. దీంతో భయాందోళనకు గురైన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news