అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సమయంలో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న తీవ్ర కలకలం సృష్టించింది. ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో బాంబుల మోత మోగింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని వేదిక పై ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆయన వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీనితో ఒక్కసారిగా బాంబు పేలుళ్ల కు ఉలిక్కిపడిన అధ్యక్షుడు కొద్దిసేపు ఆయన తన ప్రసంగాన్ని సైతం కాసేపు ఆపేశారు. మరోపక్క పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం తో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు సైతం అక్కడి నుంచి పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. అయితే ఆఫ్ఘన్ లో అక్కడక్కడ బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడం సహజమే. నిత్యం కూడా ఎదో ఒక చోట బాంబు పేలుళ్లు చోటుచేసుకొని తీవ్ర స్థాయిలో ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే ప్రమాణ స్వీకారానికి వచ్చిన అష్రఫ్ ఘని ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించకుండానే గమనార్హం. అయితే ఈ బాంబు పేలుళ్ల సంభవించడంతో ఘనీ తీవ్ర ఉద్వేగానికి లోనైన ఆఫ్ఘన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఉద్వేగానికి గురయ్యారు.
తల తెగిపడుతున్నా ప్రజల కోసమే పనిచేస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. గత నెలలో అధ్యక్ష ఫలితాలు ప్రకటించగా అష్రఫ్ ఘని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు(సోమవారం) ఆఫ్ఘన్ అధ్యక్షుడి గా వరుసగా రెండొవసారి ప్రమాణ స్వీకారం చేశారు. మరోపక్క ప్రమాణ స్వీకార సమయంలో చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అయితే బాంబు దాడికి పాల్పడ్డది ఎవరన్నది తెలియాల్సి ఉంది.