ఇటలీ లో కరోనా అల్లకల్లోలం…రూల్స్ ఉల్లంఘిస్తే ఇక జైలుకేనట!!

-

ఇటలీ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. దీనితో కరోనా ను కట్టడి చేయడం కోసం అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ కరోనా ధాటికి దాదాపు 1.ట్ కోట్ల మంది ప్రజలను అధికారులు నిర్బంధం చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. చైనా లో మొదలైన ఈ మహమ్మారి అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు పాకుతూ పోతుంది. దీనితో ఎక్కడికక్కడ దేశాలు అప్రమత్తమై ఈ కరోనా పై కఠిన చర్యలకు పూనుకుంటుంది. కరోనా కేసులను నియంత్రించడం కోసం ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికీ ఈ వైరస్ మాత్రం స్ప్రెడ్ అవుతూనే ఉంది. అయితే ఈ కరోనా మరింత విజ్రంబించడం తో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న లాంబార్డీ ప్రాంతంలో ఈ కరోనా ప్రభావం కారణం గా జనజీవనం పూర్తిగా స్తంభించింది. అయితే అత్యవసరమైన పరిస్థితులలోనే ప్రజలు బయటకి రావాలని ఎవరైనా సరే ఈ రూల్ ను ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదు అంటూ అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తుంది.

అంతేకాకుండా 206 యూరోల జరిమానా విధిస్తామంటూ హెచ్చరించింది. కరోనా వైరస్ వల్ల ఇటలీ అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 366 మంది చనిపోగా.. సుమారు 7375 మంది వైరస్ బాధితులుగా మారారు. కాగా, ఇటు భారత్‌లో కూడా వైరస్ విజృంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి ఈ మహమ్మారి బారిన పడి వారి సంఖ్య 43కి చేరిన సంగతి విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news