ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ప్రభుత్వాన్ని నడిపేందుకు ఇతర పార్టీల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ మోసపూరిత పార్టీలేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుంటూ.. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి చట్టాలను పాతరేసేలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్‌కు.. రేవంత్‌రెడ్డికి పెద్దగా తేడా ఏమి లేదంటూ కిషన్‌రెడ్డి విమర్శించారు.